Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది జరిగితే అయోధ్య స్థలంలోనే మసీదును నిర్మిస్తాం: ఓవైసీ

అయోధ్యపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే వుంటుందని ఓవైసీ నమ్మకం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:57 IST)
అయోధ్యపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే వుంటుందని ఓవైసీ నమ్మకం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి కట్టుబడి వున్నట్లు తెలిపారు.

మా మసీదు అక్కడే వుండదేని.. దేవుడి అనుగ్రహం ఉంటే.. సుప్రీం కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే.. అదే స్థలంలో మరోసారి మసీదు నిర్మిస్తామని ఓవైసీ చెప్పారు. తీర్పు వాస్తవాల ఆధారంగా వుంటుందని.. మత విశ్వాసాల ఆధారంగా కాదనే నమ్మకం ఉందని ఓవైసీ తెలిపారు. 
 
భారత్‌లో ముస్లింలు రెండో తరగతి ప్రజలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నవారు.. ఆస్థలాన్ని విడిచి వెళ్లాలని తమకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెప్తున్నది.. ఏంటంటే.. మసీదును తాము వదిలిపెట్టేది లేదని ఓవైసీ తెలిపారు.

తమను పాకిస్థానీ అనే వారిని ప్రశ్నించేది ఒక్కటేనని.. హర్షదే మెహతా.. కేతన్ పరేఖ్, నీరవ్ మోదీ ముస్లింలా అని ఓవైసీ అడిగారు. వీరు మన ప్రధానిని భాయ్ అంటూనే దేశాన్ని దోచుకున్నారని ఓవైసీ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments