Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (10:46 IST)
నేటి తరుణంలో చాలామంది విద్యార్థులు జల్సాలకు బాగా అలవాటు పడుతున్నారు. అలాంటి వారిలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు సంపాదం కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ మార్గాల ద్వారా గంజాయిని సేకరించి నగరంలో విక్రయిస్తున్నారు. సరే మానుకుంటారని అనుకుంటే.. రోజు రోజుకు ఎక్కువైపోయింది.. దాంతో పోలీసులకు చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే..
 
ఖమ్మ జిల్లాకు చెందిన కె.అఖిల్, ఎస్.కె. నయీం, టి.భానుతేజ.. ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. వీరు బీటెక్ పూర్తి చేసిన తరువాత ఉదోగ్యం కోసం నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడిని వీరు డబ్బులు సంపాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.
 
అలా అన్వేషిస్తుండగా.. ఈ ప్రాంతంలో గంజాయికి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో స్వయంగా విశాఖ, జిల్లా.. అరకు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి గంజాయిని కోనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో వీరికి పలువురు గంజాయి విక్రేతలతో పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకుని గత మూడు నెలలుగా గంజాయిని తెప్పించి వాటిని ప్యాకెట్ల రూపంలో విద్యార్థులు, అడ్డా కూలీలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు గురువారం నాడు మణికొండ ప్రాంతంలో కాపు కాశారు.
 
రోడ్ నెంబర్ 5 మీదుగా వెళుతున్న అఖిల్, నయీంలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఆపై పోలీసులు వీరు ఉంటున్న గదిలో తనిఖీలు చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గదికి వస్తున్నట్లు తెలుసుకున్న భానుతేజ తప్పించుకుట్లు తెలుస్తోంది. ఇక నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments