Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చమన్నందుకు బాణాలతో దాడి..

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:40 IST)
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఇద్దరు చెంచుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. కొట్టాలచెరువుగూడేనికి చెందిన ఉత్తలూరి లింగన్న అనే యువకుడిని అదే గూడానికి చెందిన అంకన్న బాణాలతో దాడి చేశాడు. లింగన్నకు చెందిన ద్విచక్రవాహనాన్ని అంకన్న అవసరం నిమిత్తం తీసుకున్నాడు. 
 
కాగా వాహనం మరమత్తుకు వచ్చింది. ఈ క్రమంలోనే తన వాహనాన్ని బాగు చేయించి ఇవ్వాలంటూ లింగన్న కోరాడు. అందుకు అంకన్న కూడా అంగీకరించాడు. రోజులు గడుస్తున్నా కూడా పట్టించుకోలేదు. లింగన్న నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అంకన్న కోపంతో ఇంట్లో ఉన్న బాణంతో దాడి చేశాడు. 
 
ఈ దాడిలో లింగన్నకు ఛాతి, వీపు భాగాల్లో రెండు బాణాలు గుచ్చుకున్నాయి. వెంటనే లింగన్నను తన కుటుంబసభ్యులు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలులో ఉన్న జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే నిందితుడు స్వయంగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vinayak: దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యం గా వున్నారంటున్న వినాయక్ టీమ్

Kiran Abbavaram: దిల్ రూబా స్టోరీ లైన్ చెప్పు, బైక్ గిఫ్ట్ కొట్టు : కిరణ్ అబ్బవరం

సినిమా ప్రశాంతతను కలిగించాలి, అసహ్యం కలిగించకూడదు : వెంకయ్య నాయుడు

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments