తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్, మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన మయూరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్ డిగ్రీ చదువుతుండగా, మయూరి ఇంటర్ చదువుతోంది. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని తమ కుటుంబ పెద్దలకు చెప్పారు. కానీ, వారు వారిద్దరి పెళ్లికి సమ్మతించలేదు.
దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ ప్రేమజంట.. ఒకరినొకకరు వేరుపడి జీవించలేక చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈపరిస్థితుల్లో శంషాబాద్ మండలం పిల్లోనిగూడ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.