స్త్రీపురుషులను ఒకే గదిలో నిర్బంధిస్తారా? చంద్రబాబు ఫైర్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:58 IST)
ఓ వైసీపీనేత ఫిర్యాదు చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను ఏడేళ్ల చిన్నారితో సహా చిల్లకల్లు పోలీసు స్టేషన్‌కు తెచ్చి నిర్బంధించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. కొంతమంది పోలీసులు తాము అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు.
 
ఈ సందర్భంగా భూక్యా కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఓ గదిలో ఉన్న ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఆ గదిలో చిన్నారి కూడా ఉండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నారిలో మీకు ఏ నేరస్తుడు కనిపించాడు? స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్భంధించమని ఏ చట్టం చెబుతుందని మండిపడ్డారు.
 
కోవిడ్ నిబంధనలు పేరిట టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టే మీకు ఇలా గుంపుగా అందరినీ ఒకచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించిందని ప్రశ్నించారు. కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments