దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేక పరిస్థితులు నడుమ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల మధ్య, అనేక జాగ్రత్తల మధ్య జరుగుతున్న ఈ సమావేశాల కోసం అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
కాగా సెప్టెంబరు 12న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ముందే లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 17మంది లోక్ సభ, 8మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్ సోకినట్లు నిర్థారణయ్యింది. రాజ్యసభ ఎంపీలు సెలవు కోరుతున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 14 మంది ఎంపీలు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు ఇవ్వాలంటూ ఎంపీలు దరఖాస్తులో కోరారు. కాగా కోవిడ్ 19 విసృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలు సెలవు కోరినట్లు సమాచారం.