Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆ బస్సు నో ఎంట్రీ!

ఠాగూర్
సోమవారం, 11 ఆగస్టు 2025 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతుంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ ముఖ్య కార్యద్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినదరీ, పల్లె వెలుగు, అల్ట్రా వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది. 
 
మహిళలు, బాలికలు, హిజ్రాలు తగిన గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి - తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సులో కూడా ఈ ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాఫ్, ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. 
 
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సులో సీసీ టీవీ కెమెలారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments