Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసిలో కోపరేటివ్‌ సోసైటీ ఎన్నికల‌ షెడ్యూల్‌ ఖారారు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (18:14 IST)
ఎపిఎస్‌ ఆర్టీసిలో అతిపురాత‌న‌మైన కో ఆప‌రేటివ్ సొసైటీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖ‌రార‌యింది. 1952 లో ప్రారంభించిన ఏపిఎస్‌ ఆర్టీసి క్రెడిట్‌ కో-ఆఫరేటివ్‌ సోసైటీ (సిసియస్‌)కు ఆసియా ఖండంలోనే మంచి పేరు ఉంది. ఆర్టీసి ఉద్యోగుల ఆర్దిక ఇబ్బందులను గట్టిక్కించేందుకు ఆర్టీసి ఉద్యోగుల నుండి వసూళ్లు చేసిన నిధులతోనే ఏర్పాటుచేసుకొన్న ఈ సిసియస్‌ సోసైటీ ప్రస్తుతం రూ.1,600 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఈ సోసైటీకి ప్రతి రెండు వందల మంది ఉద్యోగులకు ఒక ప్రతినిధిని ఎన్నుకొని ఈ ప్రతినిధుల ద్వారా తొమ్మిది మంది పాలకమండలి సభ్యులను ఎంపిక చేస్తారు. గెలిచిన ఈ ప్రతినిధులు   పాలకమండలి ఏర్పాటు చేస్తారు. 

 
ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈసిసియస్‌ ప్రతినిధుల ఎంపిక కాలపరిమితి ఈఏడాది డిసెంబర్‌ 30 తో పూర్తవుతున్నందున ఈ ఏడాది డిసెంబర్‌ 14 న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 డిపోలు/నాన్‌ ఆపరేషన్‌/వర్క్‌షాప్‌, యూనిట్లలో మొత్తం 210 మంది ప్రతినిధుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించ‌నున్నారు. సిసియస్‌ బోర్డు ఏర్పాటు కోసం పాలక మండలి ఎంపిక డిసెంబర్‌ 29 న నిర్వహించాలని నిర్ణ‌యించారు. బుధవారం ఆర్టీసి హౌస్‌లో ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన ఐఖ్యకూటమి పాలకమండలి సభ్యులతో జరిగిన సిసియస్‌ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఏపి పిటిడి ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు లు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
 
 
ఈ పాలకమండలి సమావేశంలో సోసైటీ వైస్‌ చైర్మన్, ఆర్టీసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఏ) ఏ.కోటేశ్వరరావు, సొసైటీ నామినేటడ్‌ మెంబర్‌ ఆర్టీసి ఛీఫ్‌ ఫైనాన్సు మేనేజర్‌ యన్‌.సుధాకర్‌ మరియు ఉద్యోగుల తరుపున ఎంపికైన ఆర్టీసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ తరఫున ఎంపికైన సిసియస్‌ పాలకమండలి సభ్యులు, వేడుంబాకుల వెంకటేశ్వరరావు, ములుపురి శ్రీనివాసరావు, యం.యం.రెడ్డి, యం.మల్లయ్య, మురిపి శ్రీనివాసరావు,యం.చాంద్‌ భాషా తోపాటు ఆర్టిసీ స్టాఫ్ వర్కర్స్‌ ఫెడరేషన్‌ సభ్యులు టి.ధశరద, సోసైటీ కార్యదర్శి తలాటం త్రాసు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments