Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుతో క్షమాపణ చెప్పించండి: మంత్రి ఆదిమూలపు సురేష్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:16 IST)
ఎస్సీల్లో ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారు అన్నచంద్రబాబు నాయుడుతో మొదట క్షమాపణ చెప్పించి ఆ తరువాత టీడీపీ లోని దళిత నేతలు వకల్తా పుచ్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

మార్కాపురం లోని మంత్రి కాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.డాక్టర్ సుధాకర్ తో మాట్లాడి మేనేజ్ చేయటం కోసం నేను రంగంలోకి దిగానని వర్ల రామయ్య మాట్లాడటం విడ్డురమన్నారు. మేనేజ్ అనే పదం టీడీపీ నాయకులకే తెలుసు. వ్యవస్థలు దేనినైనా మేనేజ్ చేయటం వారికే తెలుసన్నారు.

సుధాకర్ తో గాని ఆయన తల్లితో గాని నేను మాట్లాడినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. అవసరమైతే తన కాల్ లిస్ట్ తీసుకోవచ్చన్నారు. డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళను, వర్ల రామయ్య లాంటి వాళ్ళను తన స్వార్థ రాజకీయం కోసం పావులుగా.. బలి పశువులుగా చేస్తున్న చంద్రబాబు నాయుడు మీకు దేవుడుగా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు.

దళితులకు, బలహీనవర్గాలకు న్యాయం చేసింది డాక్టర్ వైయస్ఆర్.. ఆ తర్వాత ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిగారు ఒక్కరే అని రాష్ట్రంలోని దళితులంతా గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. అమరావతిలోనూ.. రాష్ట్రంలోని 13జిల్లాల్లో జులై 8న రాజశేఖర రెడ్డి జయంతి నాడు.. 27 లక్షల మంది దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద వర్గాలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలను అడ్డుకుంటున్న వారిని దళిత ద్రోహులు అంటారా... దళితుల మేలు కోరే వారు అంటారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా... దళితులను పురుగులుగా చూశాడు. దళితులంటే కేవలం తన కుర్చీకి అండగా ఉండేందుకు మాత్రమే.. పల్లకీలు మోయటానికి మాత్రమే అని రుజువు చేశాడని మంత్రి సురేష్ అన్నారు.  చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన మోత్కుపల్లిని చంద్రబాబు ఎంత ఘోరంగా అవమానించాడో చూశాం. 

గుంటూరుకు చెందిన పుష్పరాజ్ ను ఎలా అవమానించాడో చూశాం. గెలవలేని రాజ్యసభను వర్ల రామయ్య లాంటి వాళ్ళకు ఇచ్చి.. ఎలా అవమానించాడో కూడా చూశాం. ఇటువంటి చంద్రబాబు నాయుడుని ఇంకా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్న టీడీపీ దళిత నాయకులను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారని జాతిని అవమానించిన చంద్రబాబు చేత క్షమాపణ చెప్పించండి.

ఆ తర్వాతే ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడండని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన దళితులను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు అండ్ ఎల్లో బ్యాచ్ డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళను రోడ్డు మీదకు తెస్తున్నారు. గోల చేస్తున్నారు. అల్లరి చేస్తున్నారు.

వీరంగం సృష్టిస్తున్నారు. వీళ్ళ ఉడుత ఊపులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెదరదు గాక బెదరదని, చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా.. దళితులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటాం. నిజా లేమిటో ప్రజా క్షేత్రంలో చెబుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

విజయ్ సేతుపతి, సూరి కాంబినేషన్ విడుదల 2 మూవీ రివ్యూ

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments