ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేసినా తప్పు: ఉద్ధవ్ థాకరే

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:11 IST)
దేశంలో లాక్ డౌన్ విధించి రెండు నెలలు అయింది. కరోనా కేసులు మాత్రం నిత్యం అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతుండగానే, సడలింపులు సైతం అమలవుతున్నాయి.

దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించడం ఓ తప్పిదం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో ఒక్కసారిగా మొత్తం లాక్ డౌన్ ను ఎత్తేయడానికి వీల్లేని పరిస్థితి వచ్చిందని అన్నారు.

దేశంలో ఇప్పటికీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ఉన్నపళాన లాక్ డౌన్ ప్రకటించడం ఎంత తప్పో, ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేసినా అంతే తప్పు అని వ్యాఖ్యానించారు.

అలాంటి నిర్ణయాలు మన ప్రజలను రెండందాలా దెబ్బతీస్తాయని థాకరే పేర్కొన్నారు. రాబోయేది రుతుపవనాల కాలం కావడంతో కరోనా వ్యాప్తి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments