Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం..ఎక్కువ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి: టిటిడి

సగం ధరకే  శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం..ఎక్కువ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి: టిటిడి
, గురువారం, 21 మే 2020 (06:01 IST)
లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.

ఈ నేపథ్యంలో తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అధికారులతో చర్చించి లాక్డౌన్ ముగిసే వరకు రూ.25 కే లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.  ఈ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది, రెండు  మూడు రోజుల్లో చెబుతామన్నారు.
 
అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ బుధ‌వారం ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో మీడియాతో మాట్లాడారు. భ‌క్తుల నుండి అభ్య‌ర్థ‌న‌లు  పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50/- ల‌డ్డూను రూ.25/- కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు,చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ నగరాల్లో ఉన్న స‌మాచార కేంద్రాల్లో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

ఎవ‌రైనా ఎక్కువ మోతాదులో ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకుని భ‌క్తుల‌కు పంచ‌ద‌ల‌చుకుంటే వారు శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హరీంద్ర నాథ్ 9849575952 లేదా ఆల‌య పోటు పేష్కార్  శ్రీనివాస్ 9701092777ను సంప్ర‌దించాల‌ని కోరారు. 
 
ఈ హుండి ద్వారా పెరిగిన కానుకలు: 
2019 ఏప్రిల్ నెల‌లో ఇ-హుండీ ద్వారా  స్వామి వారికి   రూ.1.79 కోట్లు కానుకలు అందయన్నారు., ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రూ.1.97 కోట్లు కానుక లు వచ్చాయని చైర్మన్ చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా  శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేక‌పోయినా ఇ-హుండీ ద్వారా కానుక‌లు స‌మ‌ర్పించిన భ‌క్తులంద‌రికీ ఈ సంద‌ర్భంగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
 
టిటిడికి నిధుల కొర‌త లేదు
టిటిడి నిర్వ‌హ‌ణ‌కు గానీ, ఉద్యోగుల వేత‌నాలు చెల్లించేందుకు గానీ ఎలాంటి నిధుల కొర‌త లేద‌ని చైర్మన్ తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో భ‌విష్య‌త్తులో కూడా ఆ పరిస్థితి  రాదని  వెల్ల‌డించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ వేత‌నాలు చెల్లించామ‌ని, మే నెల వేత‌నాల చెల్లింపున‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. టిటిడి ఉద్యోగుల‌కు వేత‌నాలు చెల్లించ‌లేని స్థితిలో ఉంద‌ని కొన్ని మీడియాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోను ఇటీవ‌ల జ‌రిగిన ప్రచారం అవాస్తవమని  చైర్మన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరిన్ని వ్యవసాయ అనుబంధ సేవలు: మంత్రి కన్నబాబు