చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ .. తెదేపా మేనిఫెస్టో రద్దు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (07:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం టీడీపీ ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిపై వైకాపా నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎస్ఈసీ.. అన్ని అంశాలను పరిశీలించి మేనిఫెస్టోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పల్లె ప్రగతి-పంచ సూత్రాలు పేరిట తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టో తీసుకువచ్చింది. అయితే, ఈ మేనిఫెస్టో రాజ్యాంగ విరుద్ధం అంటూ అనేక విమర్శలు వచ్చాయి. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు పార్టీ తరపున మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారన్న వాదనలు వినిపించాయి.
 
దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మేనిఫెస్టో విడుదలపై టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments