Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ ఫ్రై

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ ఫ్రై
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (16:25 IST)
భారతదేశంలో నెంబర్‌ 1 ఫర్నిచర్‌ మరియు హోమ్‌ ప్రొడక్ట్స్‌ మార్కెట్‌ ప్రాంగణం పెప్పర్‌ ప్రై, ఆంధ్రప్రదేశ్‌లో తమ మొట్టమొదటి స్టూడియోను వైజాగ్‌లో తెరిచింది. ఫర్నిచర్‌ మరియు గృహ విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్‌ నెట్‌వర్క్‌గా నిర్మితం కావడమే లక్ష్యంగా పెప్పర్‌ ప్రై ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 20కు పైగా నగరాలలో 60కు పైగా స్టూడియోలు (సొంతం మరియు ఫ్రాంచైజీ)ను తెరిచింది. పెప్పర్‌ ఫ్రైకు అతిపెద్ద మార్కెట్‌గా దక్షిణ భారతదేశం నిలుస్తుంది. ఈ మార్కెట్‌లోనే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కొచి, మైసూరు, హుబ్లీ, త్రివేండ్రం, కోయంబత్తూరు మరియు ఇప్పుడు వైజాగ్‌లతో కలిపి 23 స్టూడియోలు ఉన్నాయి.
 
ఈ స్టూడియోను సైకర్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని  ఏర్పాటుచేశారు.  ఇది ఎస్‌ఎస్‌ఎన్‌ఆర్‌ స్క్వేర్‌, శంకరమఠం రోడ్‌, శాంతి పురం వద్ద 2184 చదరపు అడుగల విస్తీర్ణంలో ఉంది. ఈ స్టూడియో ద్వారా వైజాగ్‌ నగరంలో పెప్పర్‌ ప్రై యొక్క వివేకవంతులైన వినియోగదారులు వైవిధ్యమైన ఫినీషెస్‌, విప్లవాత్మక డిజైన్లు మరియు నాణ్యమైన ఉత్పత్తులు గురించి తొలి అనుభవాలను పొందవచ్చు. ఈ ఉత్పత్తులను పెప్పర్‌ ఫ్రై వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అదనంగా, స్టూడియో వద్దనున్న ఇంటిరియర్‌ డిజైన్‌ నిపుణులు ఉచితంగా స్టోర్‌ లోపల కన్సల్టెన్సీ సేవలను అందించడంతో పాటుగా వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా తమ ఇంటి ఫర్నిచర్‌ అవసరాలు తీర్చుకోవడంలో సహాయపడుతున్నారు.
 
2017లో దేశంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్‌ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే లక్ష్యంతో కంపెనీ, తమ వినూత్నమైన ఫ్రాంచైజీ నమూనాను ఆరంభించింది. అతి స్వల్పకాలంలోనే 20 ఫ్రాంచైజీలకు సొంతమైన మరియు ఫ్రాంచైజీలు నిర్వహించే స్టూడియోలను టియర్‌ 2, టియర్‌ 3 మార్కెట్లు అయినటువంటి త్రివేండ్రం, పాట్నా, బెంగళూరు, ఇండోర్‌, లక్నో, హుబ్లి, మైసూరు మరియు కోయంబత్తూరులలో తెరిచింది. ఈ ఫ్రాంచైజీ స్టూడియోల కోసం పెప్పర్‌ ఫ్రై , స్థానికంగా అత్యున్నత వ్యాపారవేత్తలతో భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది.
 
హైపర్‌ లోకల్‌ డిమాండ్‌ సైకిల్స్‌ మరియు ధోరణుల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంటుంది. ఈ కంపెనీ తమ వినూత్నమైన ఫ్రాంచైజీ నమూనాను 2020లో పునరుద్ధరించడంతో పాటుగా ప్రస్తుత మరియు సంభావ్య ఫ్రాంచైజీ భాగస్వాములకు సైతం ప్రయోజనం కలిగించేలా చేసింది. ఈ మోడల్‌ను  100% ధర సమానత్వం ఆధారంగా రూపొందించడం వల్ల భాగస్వాములు ఉత్పత్తి  నిల్వలను నిర్వహించాల్సిన అవసరం లేదు. తద్వారా ఇది పరస్పర ప్రయోజనకారిగా ఉండే వ్యాపార భాగస్వామ్యంగా నిలుస్తుంది. పెప్పర్‌ ఫ్రై ఇప్పుడు రివార్డు స్ట్రక్చర్‌ను సైతం అందిస్తుంది. దీనిలో ఫ్రాంచైజీ భాగస్వాములు 15% వరకూ కమీషన్‌ పొందే అవకాశం కలుగుతుంది (గతంలో 10%గా ఉండేది). ఫ్రాంచైజీ స్టూడియో ద్వారా ఆన్‌లైన్‌లో జరిపే ప్రతి లావాదేవీతోనూ ఈ కమీషన్‌ పొందవచ్చు.
 
దక్షిణ భారతదేశంలో పెప్పర్‌ ఫ్రై తమ స్టూడియోనెట్‌వర్క్‌ను కర్నాటక, తమిళనాడు, తెలంగాణా మరియు  కేరళలలో విస్తరిస్తుంది. ఈ ప్రాంతంలోని  వినియోగదారులు అత్యధికంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తుంటారు మరియు తమ సొంత, ఫ్రాంచైజీ నమూనాల ద్వారా మరింతగా ఈ ప్రాంతంలో చొచ్చుకుపోనుంది.
 
అమృత గుప్తా, బిజినెస్‌ హెడ్‌, పెప్పర్‌ ఫ్రై మాట్లాడుతూ, ‘‘ సైకర్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని మా మొట్టమొదటి స్టూడియోను వైజాగ్‌లో ఆరంభించడం ద్వారా మా ఓమ్నీ ఛానెల్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. దక్షిణ భారతదేశం మాకు అతి పెద్ద మార్కెట్‌. మొత్తంమ్మీద పెప్పర్‌ప్రై వ్యాపారంలో 40%కు ఇది తోడ్పాటునందిస్తుంది. ఈ ప్రాంతంలో మా ఉనికిని  మా ఎక్స్‌పీరియెన్స్‌ కేంద్రాలను తెరువడం ద్వారా బలోపేతం చేయనున్నాం’’ అని అన్నారు.
 
‘‘పెప్పర్‌ ఫ్రై వద్ద మా లక్ష్యమెప్పుడూ కూడా మా వినియోగదారులకు వీలైనంతగా చేరువకాడవంతో పాటుగా అత్యుత్తమ ధరల వద్ద మహోన్నత వెరైటీలనూ అందించడం. ఇటీవలి కాలంలో చాలా మంది వ్యక్తులు తమ గృహ వాతావరణం పట్ల మరింత ఆప్రమప్తంగా ఉంటున్నారు మరియు పనితీరు, సౌందర్య పరంగా మరింత ఆహ్లాదకరమైన ప్రాంగణాలను సృష్టించడానికి పెట్టుబడులు పెడుతున్నారు. వైజాగ్‌ నగరంలో అనుకూలమైన గృహాలను సృష్టించడంలో మా స్టూడియోలు తోడ్పడతాయని నమ్ముతున్నాను’’ అని ఆమె జోడించారు.
 
సైకర్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భాగస్వాములు కమలాకర్‌ హనుమంతు మరియు రున్‌జున్‌ హనుమంతు మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో సుప్రసిద్ధ గృహ మరియు ఫర్నిచర్‌ మార్కెట్‌ ప్రాంగణంతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. పెప్పర్‌ ఫ్రై అసలైన ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారంగా మారడంతో పాటుగా అతి పెద్ద ఓమ్నీ ఛానెల్‌ హోమ్‌ మరియు ఫర్నిచర్‌ వ్యాపారం సృష్టించాలనే ఆ సంస్థ ప్రయత్నంలో భాగం కావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు జిల్లా నుంచే అది నేర్చుకున్నా: ఎస్ఈసీ నిమ్మగడ్డ కామెంట్స్