Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కైన వైకాపా నేత... కేసు నమోదు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:26 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేకాట ఆడుతూ పోలీసులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత, అది కూడా అధికార పార్టీకి చెందిన నేతపై పోలీసులు పేకాట కేసు నమోదు చేయడం గమనార్హం. 
 
తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారావు, ప్రస్తుతం వైకాపాలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుబ్బారావు.. 1983 నుంచి పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేతిలో ఓటమి పాలయ్యారు. 
 
ఆ తర్వాత టీడీపీలో చేరిన వరుపుల ముద్రగడ పద్మనాభం చేతిలోనే ఓడిపోయారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఓడిపోయి.. 2014 ఎన్నికల్లో ఆయన తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో వైకాపాలో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments