Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లిని కొడితేనే కళ్లు పీకుతుంది.. ఇక పులి ఉరుకుంటుందా?: ఆర్ఆర్ఆర్ ప్రశ్న

raghurama
, బుధవారం, 19 అక్టోబరు 2022 (16:23 IST)
పిల్లిని ఒక గదిని బంధించి చితకబాదితే అది కళ్లు పీకేస్తుందని, కానీ పులిని రెచ్చగొడితే ఇలానే ఉంటుందని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంగళవారం వైకాపా నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడటంపై ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
 
గదిలో పెట్టి పిల్లిని కొడితేనే కళ్లు పీకుతుంది.. అదే పిలిని కొడితే ఏమవుతుంది? అంటూ ఆయన ఓ సామెతను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ విషయంలో వైకాపా ఆ పనే చేసిందన్నారు. 
 
పవన్ కళ్యాణ్‌ను అనవసరంగా కెలికిన వైకాపా నేతలు ఆయనతో తిట్లు తిన్నారన్నారు. వరుసెట్టి ఆరోపణలు గుప్పిస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందని, ఇపుడు పవన్‌ వంతు వచ్చిందని, ఎంతైనా ఆయన కూడా మనిషే కదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 
 
ఇకపోతే, మాటకముందు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్లను వైకాపా నేతలు ప్రస్తావిస్తుంటారన్నారు. అదే వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన పెళ్లిళ్ళ సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తొలి భార్య బతికుండానే ఆమెకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
వెంకటరెడ్డి తరహాలో కాకుండా పవన్ కళ్యాణ్ మొదటి, రెండు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్.షర్మిల కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు కదా అని అన్నారు. 
 
తొలుత మేనమామతో పెళ్లి జరుగగా, ఆ పెళ్లి నతకు ఇష్టం లేదని చెప్పిన షర్మిల.. తర్వాత బ్రదర్ అనిల్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారని ఆర్ఆర్ఆర్ గుర్తుచేశారు. వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన వెళ్లిళ్ళపై మాత్రం వైకాపా నేతలు ప్రస్తావించరన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్ ప్రత్యేక దేశమా..?