Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్ ... సీఎం కంగ్రాట్స్!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:58 IST)
మహిళలు, పిల్లలపై  నమోదైన కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, ఛార్జిషీట్ దాఖలు చేయడంలో దేశంలోనే ఎపి పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక విభాగం డి‌ఐజి పాలరాజు, సాంకేతిక బృందం సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా డిజిపి అభినందించారు. వారికి డిస్క్ అను ప్రదానం చేశారు. 
 
 
నిర్ణీత వ్యవధిలో అంటే 60 రోజుల్లో ఛార్జి షీట్ దాఖలు చేసిన కేసులలో 93.8% రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరంతరం  పర్యవేక్షిస్తుంది.
 
 
ఇటీవల తిరుపతి లో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ పోలీసుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. దేశ స్థాయిలో ఉన్న‌తంగా నిల‌చినందుకు డీపీపీకి, ఇత‌ర పోలీసు అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments