Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి మేకపాటి వరుస సమావేశాలు: రాష్ట్రాభివృద్దిపై ప్రధానంగా చర్చ

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (22:06 IST)
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు పర్యటన విజయవంతంగా ముగిసింది. కేంద్ర మంత్రులతో జరిగిన వరుస సమావేశాలలో రాష్ట్రాభివృద్ది, కీలక ప్రాజెక్టులు, నిధులు, కొత్త ప్రతిపాదనలపై మంత్రి మేకపాటి ప్రధానంగా చర్చించారు. న్యూఢిల్లీలో శుక్రవారం మంత్రి గౌతమ్ రెడ్డి తొలుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి వినతిపత్రాలు సమర్పించారు.

టెంపుల్ టూరిజం అభివృద్దికి ఆస్కారం ఉన్న నెల్లూరు జిల్లాపై ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని   మంత్రి మేకపాటి  విజప్తి చేశారు. ముఖ్యంగా మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గం ఆత్మకూరులో సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశంగల ప్రాంతాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు.

సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర ఆనవాళ్లున్న నేపథ్యంలో ఆ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై మంత్రి మేకపాటితో వాకబు చేశారు. గతంలో గుర్తించని కొత్త ప్రతిపాదనలను మంత్రి మేకపాటి ప్రతిపాదించిన నేపథ్యంలో వాటిని పరిశీలించిన అనంతరం తదనుగుణంగా పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడతామంటూ కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

 
కేంద్ర మంత్రి సోనోవల్ తో  మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. ట్రాన్స్ పోర్ట్ భవన్‌లో కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సోనోవల్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లకు కేంద్రం అందించవలసిన నిధులపై మంత్రి మేకపాటి చర్చించారు. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ ఉన్న నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర మంత్రి సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి  మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. ప్రధానంగా 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం  సానుకూల స్పందించినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు.

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో మేజర్ పోర్టును గుర్తించి త్వరగా  నివేదిక అందించాలని కేంద్ర మంత్రి సోనోవల్ వెల్లడించినట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన గత రెండున్నరేళ్ల కాలంలో ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించినట్లు కేంద్ర మంత్రికి గౌతమ్ రెడ్డి వివరించారు. సుదీర్ఘ తీరప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ లో  కోస్టల్ కారిడార్ అభివృద్ధికి రాష్ట్రం అమలు చేస్తున్న ప్రణాళిక, కార్యాచరణను మంత్రి మేకపాటి సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకనమిలో ఏపీ కీలకంగా వ్యవరించనుందని మంత్రి మేకపాటి పునరుద్ఘాటించారు.

సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం 2030 కల్లా ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ఎగుమతులను 10శాతం చేరుకునే లక్ష్యంతో ముందుకెళుతోందని కేంద్ర మంత్రి సోనోవల్ కి మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య ఉత్సవం - 2021ని విజయవంతంగా నిర్వహించామని మంత్రి మేకపాటి తెలిపారు. ఏపీ కొత్తగా చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకూ అన్ని విధాల సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా,  మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ,పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments