Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలువలతో కూడిన సమాజానికి పునాదులు వేయాలి : మంత్రి బొత్స

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (14:48 IST)
విలువలతో కూడిన సమాజానికి ఉపాధ్యాయులు పునాదులు వేయాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయవర్గానికి ఆది నుంచీ పెద్దపీట ఉందని, భావితరాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో వీరందరూ గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. 
 
ఉత్తమమైన వ్యక్తులుగా విద్యార్ధులను మలిచే ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేశారు. విలువలతో కూడిన సమాజమే లక్ష్యంగా, ప్రస్తతమున్న పరిస్థితుల్లో మార్పులు రావాలన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులందరూ తమ విధులను నిర్వహించాలన్నారు. 
 
 
విద్యార్ధుల్లో ఉన్నత విలువలు పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు మంచి పునాదులు వేసేలా పురపాలక శాఖ పాఠశాలల్లోనూ, ఇతర విద్యా సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments