Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పు లేదు : మంత్రి సురేష్

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (15:37 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
 
ఆయన గురువారం అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయితే పదో తరగతి పరీక్షలు ఈనెల 31 నుంచి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఇంటర్ పరీక్షలు కూడా ఈనెల 23వ తేదీలోగా పూర్తికానున్నట్లు చెప్పారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 
 
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సౌకర్యం అందజేస్తున్నామన్నారు. సెలవుల విషయంలో ఈనెల 31వ తేదీ తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments