10, 12 పరీక్షలు నిర్వహించి తీరుతాం : మంత్రి ఆదిమూలపు సురేష్

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (18:55 IST)
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, 10, 12వ తరగతుల పరీక్షలను నిర్వహించి తీరుతామని ఏపీ విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. అందువల్ల 10, 12 పరీక్షల నిర్వహణపై కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
జూలై మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, జూలై నెలాఖరున టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై గురువారం సీఎం జగన్‌తో చర్చించి.. పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల రద్దు చేయడానికి నిమిషం పట్టదని చెప్పిన మంత్రి.. విద్యార్ధుల భవిష్యత్తు, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు.
 
మరోవైపు, గత ప్రభుత్వాలు డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామన్నారు. డీఎస్పీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారన్నారు. డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments