Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (16:57 IST)
తన వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని విధుల నుంచి రాష్ట్ర హోం మంత్రి అనిత తొలగించారు. దీనిపై ఆమె స్పదించారు. తన వద్ద పనిచేసే పీఏను నేనే తీసేసాను.. దానికి వివాదం ఏముంది. ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెడుతా. అతనికి నేను జీతం ఇస్తున్నా.. రెండు, మూడు సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను, అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. అందుకే విధుల నుంచి తొలగించాను అని చెప్పారు 
 
కాగా, అవినీతి ఆరోపణల నేపథ్యంలో హోం మంత్రి అనిత తన పీఏ జగదీష్‌ను ఆ పోస్టు నుంచి తొలగించిన విషయం తెల్సిందే. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా సెటిల్‌మెంట్ దందాలు కూడా చేస్తున్నారని కూడా పలువురు ఆరోపణ చేశారు. ముఖ్యంగా, అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అనితను కలవడానికి వెళ్లిన సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
ఈ క్రమంలోనే మంత్రి అనిత తర్వాత తానే అన్నట్టుగా జగదీష్‌ వైఖరిపై టీడీపీ క్యాడర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జగదీష్‌పై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ హోం మంత్రి అనిత మాత్రం వాటిని పట్టించుకోలేదు. దీంతో అనిత అండతోనే జగదీష్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారనే విస్తృతంగా ప్రచారం సాగింది. అయినప్పటికీ హోం మంత్రి అనిత వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో జగదీష్ వ్యవహారంపై ప్రభుత్వానికి, టీడీపీ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె పీఏ జగదీష్‌ను విధుల నుంచి తప్పించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments