మంత్రి పెద్దిరెడ్డికి పూర్తి స్వేచ్ఛ .. ఎస్ఈసీ ఆంక్షలు చెల్లవు : హైకోర్టు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (13:13 IST)
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను హైకోర్టు కొట్టేవేసింది. మీడియా సమావేశం నిర్వహించేందుకు మంత్రి పెద్దిరెడ్డికి న్యాయస్థానం అనుమతిని మంజూరు చేసింది. 
 
మీడియా సమావేశాలు నిర్వహించరాదని పెద్దిరెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమినరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధించిన ఆంక్షలను చెల్లుబాటుకావని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి  మీడియాతో మాట్లాడేందుకు అనుమతినిస్తూ బుధవారం తీర్పును వెలువరించింది. పంచయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డిపై నిర్బంధం విధిస్తూ, మీడియాతో మాట్లాడకుండా నిమ్మగడ్డ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
 
ఎస్‌ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి గతవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన​ దాఖలు చేశారు. దీనిపై ఆదివారం విచారణ చేపట్టి
న న్యాయస్థానం.. నిమ్మగడ్డ ఉత్తర్వులను కొట్టివేసింది. మంత్రిపై నిర్బంధం విధిస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టింది. 
 
మంత్రి ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే మీడియాతో మాట్లాడకూడదంటూ ఇచ్చిన ఉత్తర్వులను మాత్రం న్యాయస్థానం తొలుత సమర్థించింది. 
 
దీనిపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌.. మీడియాతో మాట్లాడకుండా ఉండాలంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఆంక్షలను తప్పుపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో మంత్రి పెద్దిరెడ్డికి స్వేచ్ఛ లభించినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments