Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొడాలి నాని వీడియోను పరిశీలించి ఉత్తర్వులివ్వండి.. హైకోర్టును కోరిన ఎస్ఈసీ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:51 IST)
ఏపీ మంత్రి కొడాలి నాని ప్రసంగించిన వీడియో ఫుటేజీని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. అదేసమయంలో మరో మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేశ్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాజ్యాలతో మంత్రి కొడాలి నాని వ్యాజ్యాన్ని పోల్చి చూడలేమని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఇటీవల మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కమిషనర్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
దానిపై మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ నెల 21వరకు మీడియాలోగానీ, సమావేశాలలో గానీ మాట్లాడకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌  ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మంత్రి కొడాలి నాని శనివారం హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.
 
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజుల ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.... 'ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం. మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి, సాయంత్రంలోపు వివరణ ఇవ్వమన్నారు. రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం ఉంది... ఎన్నికల సంఘం స్థాయిని తగ్గించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు... అని పిటిషనర్‌ వివరణ ఇచ్చారు. ఈ వివరణను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చింది' అని పేర్కొన్నారు. 
 
అయితే, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ... 'షోకాజ్‌ నోటీసుతో పాటు ఆధారాలను పిటిషనర్‌కు పంపాం. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజ్‌ను పరిశీలించాలి' అని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
 
ఎస్ఈసీ తరపు న్యాయవాది వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... మీడియా సమావేశంలో పిటిషనర్‌ మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను, అందులోని అంశాలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఫుటేజ్‌లోని వివరాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments