లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు.. వస్త్ర - చెప్పులు - గోల్డ్ షాపులకు ఓకే

Webdunia
మంగళవారం, 26 మే 2020 (16:30 IST)
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఇందుకోసం మంగళవారం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ సడలింపుల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలు తెరుచుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే, విధిగా కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 
 
ఈ నిబంధనల్లో భాగంగా, పెద్ద దుకాణాల్లో షాపింగ్‌కు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని వస్త్ర దుకాణాల్లో ట్రయల్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. 
 
ఇకపోతే బంగారు, వెండి నగల షాపుల్లో డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను విధిగా ఉపయోగించాలని పేర్కొంది. షాపుకు వచ్చే ప్రతి కష్టమర్‌కు ఈ గ్లోవ్స్ ఇవ్వాలని సూచన చేసింది. ఆ తర్వాత వీటిని డస్ట్‌బిన్‌లో వేయాలని పేర్కొంది. 
 
ఇకపోతే, పుడు బళ్లపై ఆహార పదార్థాలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని స్పష్టం చేశారు. వీధి బళ్లపై అమ్మే ఆహారాన్ని అక్కడే తినకుండా చూడాలని, పార్శిల్ ఇవ్వాలని సూచించారు. అయితే, పానీ పూరీ బండ్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments