డాక్టర్ సుధాకర్ కేసు : సీబీఐ విచారణపై సుప్రీంను ఆశ్రయించనున్న ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (16:24 IST)
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. 
 
డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్టణం పోలీసులు హేయమైన రీతిలో ప్రవర్తించిన విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
డాక్టర్ సుధాకర్‌పై జరిగిన పోలీసు దాడిని హైకోర్టు తీవ్రంగా తీసుకుంది. దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి, ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
 
ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో సుధాకర్ ఒంటిపై గాయాలు లేవని ఉందని... తాజాగా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో సుధాకర్ శరీరంపై గాయలున్నాయని ఉందని... అందుకే దీని వెనుక కుట్ర ఉన్నట్టు హైకోర్టు భావించింది. 
 
అనుమానాలు ఉన్నందువల్లే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments