Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (10:38 IST)
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో గత వైకాపా ప్రభుత్వం వసూలు చేసిన చెత్త పన్నును వసూలు చేసింది. మురికివాడల్లో ఒక్కో ఇంటికి రూ.60 వేలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.120 చొప్పున వసూలు చేసింది. అయితే, ముగిసిన ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఈ చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాకామంత్రి పి.నారాయణ వెల్లడించారు. 
 
వైకాపా ప్రభుత్వం హయాంలో మున్సిపల్ శాఖలో కీలకంగా పని చేసిన ఓ మహిళా అధికారి ఆలోచనలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్లాప్ పేరుతో చెత్త సేకరణ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్‌ను ఓ కాంట్రాక్టర్‌ సంపాదించుకున్నాడు. ఈ విషయంలోనూ ఆ మహిళా అధికారి కీలకంగా వ్యవహరించారు. 
 
చెత్తపన్నులో భాగంగా, మురికివాడల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.60, మిగిలిన ప్రాంతాల్లో రూ.120 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించి, ఆ విధంగా వసూలు చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేసింది. అయితే, దీంతో క్లీన్ ఆంధ్రా (క్లాప్) పథకం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments