Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (10:12 IST)
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. అంబులెన్సులో విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వైద్యులు ఎక్స్‌రే తీసి చూడగా.. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. 
 
శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వేగంగా ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బ్యాటరీపై ఉండే స్టీల్‌ కోటింగ్‌ తొలగిపోయి, కాస్త ఉబ్బిందని.. మరికొంత సమయం అలాగే ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువయ్యేదన్నారు. కానీ.. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపేశామని తెలిపారు. ఆయుష్‌ ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష, ఎం.ఎస్‌.గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బ్యాటరీని తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments