Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తునకు జగన్ సర్కారు వ్యూహం?

Webdunia
ఆదివారం, 14 మే 2023 (19:46 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అమరావతి దరిదాపుల్లో లేకుండా చేయాలన్న లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పని చేస్తున్నట్టుగా ఉందని టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. 
 
ఇందులోభాగంగా, విజయవాడకు సమీపంలోని ఉండవల్లి కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌ చేసింది. కొన్నేళ్లుగా తెదేపా అధినేత చంద్రబాబు లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ అభియోగం మోపింది. క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని ఆస్తుల జప్తునకు సీఐడీ ఆదేశాలు జారీ చేసింది.
 
స్థానిక ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి కరకట్ట పక్కన ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తునకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని తెలుగుదేశం పార్టీనేతలు తప్పుబడుతున్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments