Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై నుంచి విజయవాడ.. 13 కిలోల స్మగ్లింగ్ గోల్డ్ బిస్కెట్లు సీజ్

gold
, శుక్రవారం, 12 మే 2023 (09:43 IST)
విజయవాడలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
13 కిలోల బంగారం బిస్కెట్లను సీజ్ చేసి.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కారులో సోదాలు చేశారు. 
 
ఈ బంగారం బిస్కెట్లను బ్యాగుల్లో పెట్టుకుని నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఆ బ్యాగుల్ని పరిశీలించగా.. గోల్డ్ బిస్కెట్లు కనిపించాయి. వాటిపై ఫారెన్ మార్క్‌ చేసి ఉంది. అరెస్ట్ చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఇది విదేశీ బంగారమని.. దీని విలువ రూ.8కోట్ల వరకు వుంటుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.32.8 కోట్ల విలువచేసే 59.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఐటీ-ఎంలో ఒకే కోర్సులో వైద్య - ఇంజనీరింగ్ విద్య