దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మద్రాస్ ఐఐటీలో వినూత్నంగా ఒక కొత్త కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకేకోర్సుగా ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
ఇందుకోసం మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ విభాగాన్ని కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణన్, ఐఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత మేధావుల ఆధ్వర్యంలో ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులమ్ తయారైందని వారు వెల్లడించారు.
ఈ కోర్సుకు వన్నె తేవడానికి ప్రముఖ ఆసుపత్రులు, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం https://mst.iitm.ac.in/ అనే వెబ్‌సైట్ చూడొచ్చని వారు వివరించారు. కాగా, ప్రస్తుతం దేశంలో వైద్య, ఇంజనీరింగ్ కేర్సులను వేర్వేరుగా పూర్తి చేయాల్సివుంది.