Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు.. ఫ్రీగా ఇస్తున్నారట..

vodafone logo
, సోమవారం, 24 ఏప్రియల్ 2023 (18:35 IST)
భారతదేశంలో 5G సేవలను ప్రారంభించడంతో ఎయిర్‌టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం భారతదేశంలో 5G సేవలను ప్రకటించడంతో, Jio, Airtel అనేక నగరాలకు 5G సాంకేతికతను విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రముఖ కంపెనీ వొడాఫోన్ ఐడియా, తోటి కంపెనీలైన ఎయిర్‌టెల్, జియోలపై TRAIకి ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయని, దీంతో కస్టమర్లు నష్టపోతున్నారని చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన Airtel, Jio కంపెనీలు తాము 5G సేవలను ఉచితంగా అందించడం లేదని, వినియోగదారులు రీఛార్జ్ చేసుకునే 4G రీఛార్జ్ ప్లాన్‌లతో అదనపు ప్రయోజనంగా 5G సేవలను అందిస్తున్నామని తెలిపారు. Airtel, Jio తమ 5G సేవలను విస్తరిస్తుండగా, Vodafone ఇంకా 5G సేవలను ప్రారంభించనందున వినియోగదారులను కోల్పోతున్నట్లు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొత్తుల విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటాను.. పవన్ కల్యాణ్