ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తు

ఠాగూర్
గురువారం, 20 నవంబరు 2025 (08:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో కీలక ములుపు తిరిగింది. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్ముతో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు సంపాదించుకున్నట్టు తేలింది. దీంతో ఆ ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సులకు ఏపీ సర్కారు ఆమోదముద్ర వేసింది. 
 
తితిదే మాజీ చైర్మన్‌,  వైకాపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కేవీఎన్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న చర, స్థిరాస్తులను జప్తు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం స్కామ్ ద్వారా చెవిరెడ్డి ఫ్యామిలీ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. 
 
సుమారు రూ.54.87 కోట్ల నల్లధనాన్ని అధికార అండతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు సిట్ చేసిన విజ్ఞప్తి ఆధారంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీశారు. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments