Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (19:02 IST)
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు.
 
భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లాగా, సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన గొట్టుపర్తి మనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18) గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు.
 
ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరి చందన్, పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments