Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్జీవోల‌కు శుభ‌వార్త‌; 23.29 శాతం ఫిట్ మెంట్

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (16:58 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 
 
గ‌త కొద్ది నెల‌లుగా ఉద్యోగుల పిఆర్సీపై వివాదం న‌డుస్తోంది. ప్ర‌భుత్వంతో ప‌లు మార్లు చ‌ర్చ‌ల అనంత‌రం, చివ‌రికి నిన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ఎన్జీవో సంఘాలు స‌మావేశం అయ్యాయి. ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వానికి చెప్పుకుంటే, ప్ర‌భుత్వం త‌మ ఆర్ధిక‌, బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల్నిఉద్యోగ సంఘాల నాయ‌కుల‌కు చెప్పుకుంది. చివ‌రికి మీకు మంచే చేస్తా, ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించండ‌ని సీఎం జ‌గ‌న్ విజ్న‌ప్తి కూడా చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 ఫిట్మెంట్ ప్రకటించారు. అలాగే, 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్ల కు పెంచుతున్న‌ట్లు తెలిపారు. జ‌నవరి 1 నుంచి కొత్త జీతాలు అమలు అవుతాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. అలాగే, పీ ఆర్ సీ 1- 7-2018 నుండి అమలు అవుతుంద‌ని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments