Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ = బీజేపీ = కాంగ్రెస్ = సీపీఐ = జనసేన; సజ్జ‌ల లెక్క ఇది!

Advertiesment
టీడీపీ = బీజేపీ = కాంగ్రెస్ = సీపీఐ = జనసేన; సజ్జ‌ల లెక్క ఇది!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (18:21 IST)
నాడు వ్యక్తులతో, నేడు  పార్టీలతో చంద్ర‌బాబు తోలు బొమ్మలాట ఆడుతున్నార‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్న విజయవాడలో జ‌రిగిన బీజేపీ ప్ర‌జాగ్ర‌హ స‌భ తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభలా జరిగింద‌న్నారు. చంద్రబాబు నాయుడు ఎజెండాలో భాగంగానే ఈ సభ పెట్టార‌ని, సివిల్‌ సొసైటీ పేరుతో పదిరకాల ఇండివిడ్యూవల్స్‌ను తీసుకొచ్చి, పదిరకాల టీవీ డిబేట్లలో విశ్లేషకులుగా పెట్టి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాట‌న్నారు. 
 
 
 
ఎరుపులో ఒక పార్టీ సీపీఐ నుంచి కాషాయ పార్టీ వరకూ అంతా ఒకటే తాను అని, టీడీపీ = బీజేపీ = కాంగ్రెస్ = సీపీఐ = జనసేన అని అభివ‌ర్ణించారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో, న్యాయస్థానం నుంచి దేవస్థానం అని  400మందితో పాదయాత్ర పేరుతో వందకోట్లు వసూలు చేసి తిరుపతి చేరుకుని అక్కడ సభలో వీరిందరు కలిసినప్పుడు ఫర్‌ఫెక్ట్‌ పిక్చర్స్‌ వచ్చింద‌న్నారు. 

 
ఇక బీజేపీ నేత సునీల్‌ థియోదర్‌ ట్వీట్స్‌ అన్నీ పచ్చి అబద్ధపు కూతలేన‌న్నారు. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా మత మార్పిడులే అని బీజేపీ అంటే, రెండోరోజు జనసేన ఎత్తుకుంటుంది. మధ్యాహ్నానికి ఇదే విషయాన్ని సీపీఐ రామకృష్ణ మొదలుపెడతారు... ఒకోరోజు పాత్ర మారొచ్చు. ఈ మూడు పార్టీలూ ఒక తానులో ముక్కలుగా తయారయ్యాయి. గతంలో చలసాని శ్రీనివాస్‌, గరుడ పురాణం శివాజీ మాదిరిగా. .ఒక్కొక్కరుగా ఉంటే ఇప్పుడు పార్టీలు ఆ పాత్రను పోషిస్తున్నాయ‌న్నారు.
 
 
అప్పట్లో వ్యక్తులను తయారు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పార్టీలను విజయవంతంగా తన ఫింగర్‌ టిప్స్‌మీద తోలుబొమ్మలాట ఆడిస్తున్నార‌ని చెప్పారు. ఆయన ఏది అనుకుంటే అదే స్టేట్‌మెంట్‌. మూడు రోజులు పాటు వరుసగా ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడులో బ్యానర్‌ ఐటమ్‌ లతో వార్తలు వస్తాయ‌ని, వీటిని మూడు రోజులు పాటు చదివేవాడికి, ఒకేసారి ఇంతమంది అంటున్నారంటే, అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది అనే అభిప్రాయానికి, అనుమానానికి తీసుకురావాలన్నదే వీళ్ళ ప్రయత్నం అని వివ‌రించారు.
 
 
ఇంత పెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ, జాతీయ స్థాయిలో కాకుండా, ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా పనిచేయడం బహుశా దేశంలోనే తొలిసారేమో అని స‌జ్జ‌ల ఎద్దేవా చేశారు.   చంద్రబాబు నాయుడు అనే దుష్టశక్తి ఎత్తుగడలు, మ్యానిప్లేషన్స్‌లో భాగంగా, తన గేమ్‌లో ప్రతి ఒక్కరినీ పావులాగా వాడుకోగలిగిన, రాజకీయాల్లో మాయల పకీరు లాంటి బాబు ఎజెండాను పట్టుకుని సభ పెట్టడం చూస్తే జాలి కలిగిస్తోంద‌న్నారు.
 
 
బీజేపీ ప్ర‌జాగ్ర‌హ సభలో కూడా ముందు సునీల్‌ దేవధర్‌, వెనుక సుజనా చౌదరి ఉంటార‌ని, ముందు మాటలు సోము వీర్రాజువి అయితే, ఆ స్క్రిప్ట్‌ మాత్రం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తయారు అవుతుంద‌ని, చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి దళపతులు లాంటి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ బీజేపీ ప్రజాగ్రహ సభను నడపడం ఆశ్చర్యం కలిగిస్తోంద‌న్నారు. 

 
ప్ర‌ధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలకు చంద్రబాబు చేతిలో దారుణంగా దెబ్బతిన్న అనుభవం ఉంద‌ని, అయినా ఆ ఇద్ద‌రు ఇపుడు కొత్త‌గా స‌మీక‌ర‌ణాలు చేస్తున్నార‌న్నారు. రాజ్యాంగాన్ని అవమానించేలా టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీ అఫిషియల్‌ ఎంపీలుగా వ్యవహరిస్తుండటం, వారిని మీడియాతో సహా అంతా బీజేపీ ఎంపీలుగా గుర్తించేసి,  యాక్సెప్టెన్స్‌ ఆ లెవల్‌కు తీసుకువెళ్ళార‌న్నారు. టీడీపీ పొరపాటున కూడా వారిపై అనర్హత వేటు వేయమని అడగద‌ని, పైగా వీళ్ళు అందరూ రాజ్యాంగం గురించి మాట్లాడతార‌ని స‌జ్జ‌ల ఎద్దేవా చేశారు. 

 
2024లో తమని ఎన్నుకుంటే, రూ.50కే బ్రాందీ ఇస్తానని ఒకాయన, ఒకవైపు స్కామ్‌ రాజధాని అమరావతి అంటూనే మూడేళ్లలో అమరావతిలో రాజధాని కట్టేస్తామని అని మరొకాయన చెబుతార‌ని విమ‌ర్శించారు. 
బీజేపీ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టే సోము వీర్రాజు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారేమోన‌ని, లేదా  జాతీయ స్థాయిలో ఇదే పాలసీని ఆ పార్టీ నేతలు చర్చించి అమలు చేస్తారేమో చూడాల‌న్నారు.
 
 
చంద్రబాబు డిజిపి రాసిన లేఖను చూస్తే నవ్వు వస్తోంద‌ని, వంగవీటి రాధాకు భద్రత కల్పిస్తామని ప్రభుత్వమే చెప్పింద‌ని స‌జ్జ‌ల అన్నారు. దీనిమీద 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. వంగవీటి రాధా ఓ సభలో తనపై రెక్కీ నిర్వహించారని  చెప్పిన మాటలను పట్టుకుని.. గూండారాజ్‌, హింసారాజ్‌ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చాంతాడంత లేఖ రాయడం ఆశ్చర్యమేస్తోంద‌న్నారు. చంద్రబాబు, తానే తుమ్ముకుని, తానే శ్రీరామ అనుకునే బాపతు అని, రాధా మాటలను పట్టుకుని, రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందని చంద్రబాబు మాట్లాడటం సరికాద‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో నక్సలిజం - టెర్రరిజం తగ్గింది.. లోకల్ మాఫియా పెరిగింది...