Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య కంటి పసరు మందుకు అభ్యంతరం లేదు : ఏపీ సర్కారు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (14:10 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ప్రాణాపాయస్థితిలో ఉండే కరోనా రోగులకు ఇచ్చే పసరు మందుపై  గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 
 
ఆ మందు వేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మందు నిల్వపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆనందయ్య, ప్రజాప్రయోజనాల తరపున.. న్యాయవాదుల వాదనలు హైకోర్టు ఆలకించనుంది. 
 
మరోవైపు, ఆనందయ్య కరోనా బాధితులకు ఇచ్చే మందు ఈ నెల 7వ తేదీ నుంచి తిరిగి పంపిణీ చేయనున్నారు. ఈ మందు పంపిణీకి ఏపీ హైకోర్టుతో పాటు.. ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మందు పంపిణీ విధివిధానాలపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
 
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ మందును వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ పద్ధతిలో పంపిణీ చేస్తామని, అది కూడా ఆన్‌లైన్‌లో  బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మందును పోస్టు, కొరియర్ సేవల ద్వారా కూడా అందిస్తామన్నారు. 
 
అయితే, కరోనా సోకిన వారికే తొలి ప్రాధాన్యత అని, మందును మొదట వారికే అందిస్తామని కాకాని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో, కరోనా రాకుండా మందు ఇవ్వనున్నట్టు వివరించారు. ఆన్‌లైన్ విధానంలో మందు పంపిణీ చేస్తున్నందున, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
 
ఆనందయ్య మందు పంపిణీపై చర్చించేందుకు మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ హాజరయ్యారు. వీరంతా మందు పంపిణీ విధానంపై సుధీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ సన్నివేశంలో గాయపడ్డా షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

మహా శివరాత్రికి నితిన్, దిల్ రాజు కాంబినేషన్ మూవీ తమ్ముడు సిద్ధం

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ చిత్రం పేరు ఘాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments