సెకండ్ వేవ్ కరోనా తగ్గుతూ ఉంది. ఈనెల చివరి లోపు సెకండ్ వేవ్ ప్రభావం బాగా తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే థర్డ్ వేవ్ వెంటనే అంటే జూలై మొదటి నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో ప్రజల్లో థర్డ్ వేవ్ పైన ఆందోళన మొదలైంది.
అయితే ప్రభుత్వం తను ఔషధాన్ని చేయడానికి అనుమతినివ్వడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు ఆనందయ్య. నెల్లూరు జిల్లాలో మూలికల కోసం శిష్యులను పంపించి వాటిని తీసుకురమ్మని చెప్పారు. సెకండ్ వేవ్ కరోనా సోకిన వారికే కాదు థర్డ్ వేవ్‌లో కరోనా రాకుండా కూడా మందును సిద్థం చేస్తున్నాను.
ఆ ఔషధం తయారుచేయడానికి ఏ మూలికలు కావాలో వాటి గురించి ఎప్పుడో స్టడీ చేశానంటున్నాడు ఆనందయ్య. అయితే ప్రస్తుతానికి కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించిన పాజిటివ్ వచ్చిన వారికి ఔషధాన్ని అందిస్తానని చెబుతున్నాడు. లక్షల మందికి ఈ ఔషధం ఇవ్వాలి కాబట్టి తయారుచేయడానికి బాగా సమయం పడుతుందంటున్నాడు.
సెకండ్ వేవ్ నుంచి పూర్తిగా కోలుకునే కన్నా ముందే థర్డ్ వేవ్‌కు ఔషధాన్ని సిద్ధం చేసి ఇస్తానంటున్నాడు. ప్రభుత్వం అనుమతినివ్వడంపై ఆనందయ్య సంతోషంతో ఉన్నారు. ఎంతోమంది కరోనా సోకిన రోగులను ప్రాణాలను కాపాడుతానన్న ధీమాతో ఆనందయ్య ఉన్నారు.