ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల.. 92.85% మంది అర్హత

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్ సెట్ (ఈఏపీ సెట్) అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. తాజాగా అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాట్లాడుతూ.. ఏపీ ఈఏపీ సెట్‌లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాకు మొత్తంగా 2,59,688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
 
అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం 83,820 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షలకు 78,066 మంది విద్యార్థులు హాజరు కాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. 
 
ఇక హాజరైన విద్యార్థుల్లో 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారన్నారు. అలాగే రేపటి నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడకు, అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?

మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క

Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments