Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన భర్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:39 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హెచ్‌ఐవి రోగికి ఉపయోగించిన సూదితో గర్భిణి అయిన తన భార్యకు ఇంజెక్షన్‌ చేశాడు ఒక భర్త. విడాకులు కావాలంటూ ఈ విధంగా అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహేశ్‌ గౌతమ్‌ అలీగఢ్‌లోని ఒక ఆస్పత్రిలోని ల్యాబ్‌లో కాంట్రాక్టు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
 
గతేడాది డిసెంబర్‌లో అతడికి ఒక యువతితో వివాహం జరిగింది. అయితే మహేశ్‌కు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని భార్యకు తెలిసింది. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో.. ఆమెను విడాకులు కావాలంటూ వేధించడం ప్రారంభించాడు.
 
ఈ క్రమంలోనే ఒక హెచ్‌ఐవి రోగికి ఇచ్చిన సూదితోనే మహేశ్‌ తన భార్యకు ఇంజెక్షన్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచే భర్త తనకు హెచ్‌ఐవిని సోకేలా చేసేందుకు యత్నిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
తన కుమార్తె అత్తామామలతో పాటు ఆస్పత్రి యజమాని కూడా ఈ కుట్రకు పాల్పడ్డారని తండ్రి ఆరోపించారు. వీరంతా బంధువులే అని పేర్కొన్నారు. నిందితులతో పాటు ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం