ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రం.. ప్రారంభించిన పవన్

ఠాగూర్
ఆదివారం, 9 నవంబరు 2025 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంకీ ఏనుగుల కేంద్రం ఏర్పాటైంది. చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 
 
ఈ కేంద్రానికి కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను రప్పించినట్టు పవన్‌ కల్యాణ్‌కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్‌ కల్యాణ్‌ తిలకించారు. వాటికి ఆహారం తినిపించారు. 
 
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా, ఆయన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులు వరుస క్రమంలో వచ్చి కవాతు నిర్వహించాయి. ఈ దృశ్యాలను పవన్ కళ్యాణ్ తన మొబైల్ ఫోనులో రికార్డు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments