రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ఏపీ కౌంటర్‌

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:09 IST)
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్‌ సకాలంలో రాకపోవడం వల్లే రోగులు మృతి చెందారని వెల్లడించింది. ఆక్సిజన్‌ రావడంలో జాప్యంతోనే 23 మంది చనిపోయినట్లు అఫిడవిట్‌ సమర్పించింది. ఆక్సిజన్‌ సరఫరా కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు కోర్టుకు తెలిపింది. 
 
గత మే నెలలో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం నెలకొని కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో రుయా ఆసుప‌త్రిలో హాహాకారాలు నెల‌కొన్నాయి. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా పేరొందిన రుయా ఆసుప‌త్రికి కేవ‌లం ఆక్సీజ‌న్ కొర‌త వ‌ల్లే చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ సంఘ‌ట‌న‌లో మృతి చెందిన కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించింద‌ని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments