Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ లేకుండా రైలెక్కిన ప్రయాణికుడు.. అరెస్టు చేసి మెంటల్ ఆస్పత్రికి తరలింపు...

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:07 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించాలని ప్రభుత్వాలతో పాటు వైద్యులు కూడా పదేపదే కోరుతున్నారు. అయినప్పటికీ అనేక మంది ఇప్పటికీ ప‌లువురు నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా పాటించే సింగ‌పూర్‌లో ఓ వ్య‌క్తి మాస్క్ ధ‌రించ‌కుండా రైలు ప్ర‌యాణం సాగించాడు. కేవ‌లం గంట‌లోపే అత‌డిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయ‌స్ధానం ఆదేశాల మేరకు అత‌డిని మాన‌సిక వైద్య‌శాల‌కు త‌ర‌లించారు.
 
బ్రిటిష్ జాతీయుడైన బెంజ‌మిన్ గ్లెయిన్ మాస్క్‌లు కొవిడ్‌-19 సోక‌కుండా మ‌న‌ల్ని కాపాడ‌లేవ‌ని న‌మ్ముతూ మాస్క్ ధ‌రించ‌కుండానే సింగపూర్‌లోని త‌న కార్యాల‌యానికి ఈ ఏడాది మేలో రైలులో బ‌య‌లుదేరాడు. ప్ర‌యాణం సాగిన కొద్దిగంట‌ల్లోనే గ్లెయిన్ (40)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.
 
మాస్క్ ధ‌రించ‌క‌పోవ‌డం స‌హా ఆయ‌న‌పై ప‌లు అభియోగాలు న‌మోదు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు గ్లెయిన్‌ను మాన‌సిక వైద్య‌శాల‌కు త‌ర‌లించి చికిత్స అందించాల‌ని సూచించింది. కాగా త‌న‌పై త‌ప్పుడు అభియోగాలు న‌మోదు చేశార‌ని కోర్టు ద‌ర్యాప్తు స‌రైన తీరులో లేద‌ని గ్లెయిన్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments