Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ సర్కారు!!

Webdunia
గురువారం, 14 మే 2020 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టింది. నవరత్న హామీల అమలుకోసం అవసరమైన నిధుల సమీకరణంలో భాగంగా, ఈ భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి విక్రయించనుంది. 
 
తొలి విడతలో విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఈ భూముల విక్రయానికి సంబంధించిన వేలం పాట ప్రారంభంకానుంది. ఈ భూములు అమ్మడం వల్ల వచ్చే నిధులను నవరత్నాలు, నాడు - నేడు వంటి కార్యక్రమాల అమలుకు వెచ్చించనుంది. 
 
ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. వేలం వేయాలనుకున్న తొమ్మిది స్థలాలకు రిజర్వ్ ధరగా రూ.208.62 కోట్లను నిర్ణయించినట్టు చెప్పారు. ధరావతు కింద 10 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 
తొలి విడతలో విక్రయించనున్న భూముల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు - 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీ - 5.44 ఎకరాలు, మెయిన్ బీటీ రోడ్డు - 1.72 ఎకరాలు చొప్పున వేలం వేస్తారు. 
 
అలాగే, విశాఖపట్టణం జిల్లాలో చిన గడ్లీ - 1 ఎకరం, చిన గడ్లీ - 75 సెంట్లు, ఆగనంపూడి - 50 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 35 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 1.93 ఎకరాలు, ఫకీర్ టకియా ఎసీఈజెడ్ - 1.04 ఎకరాలు చొప్పున వేలం వేసి విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments