ఏపీలో బాలికలకు మండలానికో జూనియర్ కాలేజీ

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇపుడు మండలానికో జూనియర్ కాలేజీని స్థాపిస్తామని తెలిపారు. అదీ కూడా కేవలం బాలికలకు మాత్రమే. అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
రాష్ట్ర విద్యాశాఖపై జరిపిన సమీక్షలో భాగంగా, సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 23975 పాఠశాలల్లో నాడు నేడు రెండో విడత కింద పనులు జరిగాయని చెప్పారు. నెల రోజుల్లో నూటికి నూరు శాతం రెండో దశ కింద పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా గోరుముద్దు, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ వంటివాటి అమలుపై మరింత ధ్యాస పెట్టాలని కోరారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇపుడు ఏకంగా 1200 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా కేజీబీవీ లేదా హైస్కూల్ ప్లస్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments