Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారానికి రావాలని వుంది.. కానీ రాలేకపోతున్నా.. బద్వేల్ ఓటర్లకు సీఎం జగన్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (13:20 IST)
కర్నూలు జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున దాసరి సుధ పోటీ చేస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీల తరపున అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో బద్వేలు నియోజకవర్గ ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 30న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుండగా వైసీపీ నుంచి దాసరి సుధ పోటీలో ఉన్నారు. ఆమెను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని జగన్ ఆ లేఖలో కోరారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారానికి రావాలని అనుకున్నానట్టు చెప్పారు. 
 
కానీ ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా రాలేకపోతున్నట్టు చెప్పారు. తాను ప్రచారానికి వస్తే అక్కాచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరైనా కరోనా బారినపడే అవకాశం ఉందని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ప్రచారానికి రాలేకపోతున్నానంటూ పేరుపేరునా ముద్రించిన కర పత్రాలను స్థానిక నేతలు పంపిణీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments