Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ప్లీనరీ : గులాబీ దళపతిగా కేసీఆర్ ఏకగ్రీవం

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (12:03 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్లీనరీ సమావేశాలు సోమవారం జరుగుతున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటరులో ఈ వేడుకలు మొదలయ్యాయి. ఇందులో తెరాస అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు.
 
ఈ మేర‌కు తెరాస మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. పార్టీ‌లోని అన్ని విభా‌గాలు, అన్ని సామా‌జి‌క‌వ‌ర్గాల నేతలు కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ నామి‌నే‌షన్లు దాఖ‌లు‌చే‌శారు. అధ్యక్ష పద‌వికి ఇత‌రు‌లె‌వ్వరూ నామి‌నే‌షన్లు దాఖ‌లు చే‌య‌క‌పో‌వ‌డంతో కేసీ‌ఆర్‌ ఎన్నిక ప్రక‌టన ఏక‌గ్రీవ‌మైంది.
 
పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ ఇప్ప‌టి‌వ‌రకు వరు‌సగా ఎని‌మి‌ది‌సార్లు ఏక‌గ్రీ‌వంగా ఎన్ని‌క‌య్యారు. పార్టీ ఆవి‌ర్భావం తర్వాత ఇది 9వ సంస్థా‌గత ఎన్నిక. చివ‌రి‌సా‌రిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరి‌గింది. 2019లో పార్ల‌మెంట్‌ ఎన్ని‌కలు, 2020, 2021లో కరోనా కార‌ణంగా పార్టీ ప్లీనరీ నిర్వ‌హిం‌చ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments