31 నుంచి పల్నాడులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (11:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావు పేట మండలంలోని యల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. యల్లమంద గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. పైగా, ఒక్క రోజు ముందుగానే సామాజిక పింఛన్లను ఇవ్వనున్నారు 
 
ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యల్లమంద గ్రామంలో సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ముందుగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జనవరి 1న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో ఏర్పాట్లు చేస్తుండగా, సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
 
సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments