Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

pawan kalyan

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (19:48 IST)
నేను మీసాలు తిప్పితే, ఛాతిలో గుద్దుకుంటే రోడ్లు పడవని, నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను, ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు.. సీఎం సీఎం అంటారు... డిప్యూటీ సీఎం అయ్యాను కదా అందూ మన్యం జిల్లా యువతను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
ఆయన శుక్రవాం పార్వతీపురం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాగుజోల అనే గిరిజన గ్రామంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఓజీ ఓజీ... సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే, ఆ అభిమానులపై పవన్ చిరు కోపం ప్రదర్శించారు. కొంచెం మందలిస్తున్న ధోరణిలో వ్యాఖ్యానించారు.
 
"నన్ను పని చేసుకోనివ్వండి. కనీసం రోడ్డు కూడా కనిపించనంతగా నా మీద పడిపోయారు. మీకందరికీ దండం పెడతాను... రోడ్డు చూడనివ్వండి నన్ను అని చెప్పాల్సి వచ్చింది. ఓజీ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు... లేకపోతే, ఇంతకుముందు సీఎం సీఎం అనేవాళ్లు... అదింకా పోలేదు... నేను డిప్యూటీ సీఎం అయినా గానీ వాళ్లకు ఆనందం కలగడంలేదు.
 
అందరికీ నేను చెప్పేది ఒక్కటే... నేను వచ్చినప్పుడు అందరూ నన్ను చుట్టుముడితే పనులు జరగవు. నన్ను పనిచేయనివ్వండి. ఉత్తరాంధ్ర... ప్రజలకు తెలుగు వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు నేర్పించిన నేల ఇది, ఎవరైనా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. కానీ ఇవాళ మీరు సినిమాల మోజులో పడి... ఓజీ ఓజీ అని పోస్టర్లు పెట్టి, జేజేలు కొడితే జీవితంలో ముందుకు వెళ్లలేరు.
 
మాట్లాడితే చాలు... అన్నా మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్ల నిర్మాణం జరుగుతుందా? నేను ఛాతీ గుద్దుకుంటే రోడ్లు పడతాయా?... నేను వెళ్లి ప్రధానమంత్రి గారికి దణ్ణం పెట్టి, సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళితే రోడ్లు పడతాయి. అందుకే, మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతకావు... నాకు పనిచేయడమే తెలుసు" అంటూ పవన్ కల్యాణ్ అభిమానులకు హితోపదేశం చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!