ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 చిత్రం జాతీయ స్థాయిలో విడుదలై మంచి ఆదరణ పొందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరులు నటించారు. గత కొంతకాలంగా జపాన్ లో విడుదలకానున్నదని అని వార్తలు వచ్చాయి. నేడు జపాన్ లో కల్కి విడుదలతేదీ ప్రకటిస్తూ ప్రభాస్ ఓ వీడియో విడుదలచేశారు.
ఇంతకుముందు జపాన్ వచ్చి మీతో ఆనందాన్ని పంచుకోవాలనుకున్నా. కానీ కొత్త సినిమా షూటింగ్ లో కాలికి స్వల్ప గాయం కావడంవల్ల ఇప్పుడు రాలేకపోతున్నా. జపాన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతున్నా. జనవరి 3న విడుదలకాబోతున్న కల్కి సినిమాను చూసి ఎంజాయ్ చేయడండి. ఈసారి తప్పకుండా జపాన్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ కొద్దిసేపు జపాన్ బాషలో కూడా మాట్లాడారు.