Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీ జైలుకు- నా భరోసా' ఇది జగన్ నినాదం : చంద్రబాబు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:06 IST)
ఎన్నికల వేడి ఊపందుకుంది. దీంతో రాజకీయ నేతలు కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు. ముఖ్యంగా, పార్టీల అధినేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్లను పరిశీలిస్తే, 
 
* వైసీపీ అసలు పార్టీయేకాదు. ఆ పార్టీ గురించి, దాని నాయకుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. ఇంత దివాలాకోరు పార్టీని నా జీవితంలో చూడలేదు. తండ్రిని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు. చేసిన నేరాలకు జైలుకు పోయి వచ్చాడు. ఇప్పుడు మనందరికీ ధర్మపన్నాలు వల్లిస్తున్నాడు.
 
* వైసీపీలో వేలం ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాళ్లకే వైసీపీ టికెట్‌. టీడీపీలో ప్రజాసేవే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికం. రైతులు, మహిళలు, యువతే టీడీపీకి పునాదులు. గాలికి వచ్చినోళ్లు గాలికే పోయే పరిస్థితి, మళ్లీ టీడీపీలోకి వస్తామంటే వద్దని చెప్పా. 
 
* యుద్ధానికి టీడీపీ సిద్ధంగా ఉంది. మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావొచ్చింది. వాస్తవాలకు దగ్గరగా అభ్యర్ధుల ఎంపిక చేశాం. అన్ని స్థానాల్లో గెలిస్తే పరిపాలన సులభతరం అవుతుంది. 25 ఎంపీ, 150 పైగా అసెంబ్లీ స్థానంలో టీడీపీ గెలిచేలా కృషిచేయాలి.
 
* మరో రెండు, మూడు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం. తిరుపతి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించి, శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. 'మీ భవిష్యత్తు- నా బాధ్యత' మన నినాదం. 'మీ జైలుకు- నా భరోసా' జగన్‌ నినాదం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments